వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రక్షించడం అభినందనీయం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Sakshitha news

వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రక్షించడం అభినందనీయం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

*ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు అభినందనలు

సహాయక చర్యల్లో పాల్గొన్న అర్హులైన సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం

వరద నష్టంపై రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలి

మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏర్పడిన వరద పరిస్థితులు, జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సత్తుపల్లిలోని సింగరేణి అతిథి గృహంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా మంత్రి సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్దకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు మత్స్యకారులను సురక్షితంగా రక్షించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, అగ్నిమాపక శాఖల సిబ్బందిని అభినందించారు.దమ్మపేటలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న అలుగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సత్తుపల్లిలో తుపాను ప్రభావంతో ముంపునకు గురైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు, జరిగిన నష్టంపై సమీక్షించినట్లు తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, సహాయక బృందాలు రాత్రంతా అవిశ్రాంతంగా శ్రమించి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు. ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా సహాయక చర్యలను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

గతంలో వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని మంత్రి వివరించారు. పోలీస్ శాఖ నుంచి 1,200 మంది, అగ్నిమాపక శాఖ నుంచి 700 మందిని ఎంపిక చేసి మొత్తం 1,900 మందికి ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు సుమారు రూ.260 నుంచి రూ.270 కోట్ల వ్యయంతో ఆధునిక రెస్క్యూ పరికరాలను సమకూర్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా విపత్తు సంభవించినప్పుడు 45 నుంచి 50 నిమిషాల్లో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకునేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమన్వయంతో పనిచేసి విలువైన ప్రాణాలను కాపాడాయని ప్రశంసించారు.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని, కొన్ని చెరువుల కట్టలు తెగిపోగా, మరికొన్ని చెరువులు పొంగిపొర్లడంతో కట్టలు దెబ్బతిన్నాయని తెలిపారు. మల్లెపూవు వాగు ఉధృతంగా ప్రవహించడంతో దిగువ ప్రాంతాల్లో వరి తదితర పంటలు దెబ్బతిన్నాయని, వాగుకు ఇరువైపులా సుమారు 200 నుంచి 300 మీటర్ల పరిధిలో పంట నష్టం జరిగినట్లు వివరించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు కూడా పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని తెలిపారు.

రెండు జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని వాస్తవికంగా అంచనా వేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర శాఖల అధికారులు తమ శాఖలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రెండు మూడు రోజుల్లో పూర్తి వి…