పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారు పున్నం మురళి రజిత నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై ఇంటి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెడుతున్న లబ్ధిదారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి కేవలం నివాసం మాత్రమే కాదని, అది ఆత్మగౌరవానికి, భద్రతకు, భవిష్యత్తుకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ గాజు కృష్ణవేణి యుగేందర్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కుమారస్వామి, డైరెక్టర్లు రత్నాకర్, ఐలి గౌడ్, మల్లారెడ్డిపల్లె మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గట్ల సాంబయ్య,జిల్లా యువజన నాయకులు జెట్టి యుగేందర్, అర్వపల్లి సర్పంచ్ ప్రభాకర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
