కూకట్పల్లి 4th ప్లేస్‌లో హనుమంతు మరియు రమేష్

Sakshitha news

కూకట్పల్లి 4th ప్లేస్‌లో హనుమంతు మరియు రమేష్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “RRR DIGITAL ప్రింటింగ్ ప్రెస్” షాపును TPCC ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన హనుమంతు మరియు రమేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో మంచి పేరు సంపాదించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించడం జరిగింది.

స్థానికంగా నూతన వ్యాపారాలు ప్రారంభం కావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన షాపు ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో దేశాలు,గొట్టుముక్కలు వెంకటేశ్వరరావు, రాజేష్ శంకర్ ,అరవింద్ రెడ్డి, కరుణాకర్ , రంగమోహన్, అబ్దుల్లా, లక్ష్మణ్ గౌడ్, బాలరాజ్ ,రమేష్, వినోద్ ,సుజాత, బాబ్జి, బచ్చు మళ్ళీ, రవి తదితరులు పాల్గొన్నారు.