హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని లేక్ వ్యూ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి లో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి టెంకాయ కొట్టి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, లేక్ వ్యూ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి లో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి టెంకాయ కొట్టి ప్రారంభించడం జరిందని, పనులను త్వరిత గతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది, అలానే రోడ్ నెంబర్ మూడవ లైన్ లో పునర్నిర్మించాల్సిన సెవెరేజ్ లైన్ పనుల అంచనాలను తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.
ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను PAC చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
