మాజీ సర్పంచ్ సంపత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పైండ్ల సంపత్ ఇటీవల అనారోగ్యానికి గురై ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి సంపత్ ని పరామర్శించారు. ఈ సందర్భంగా సంపత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో ఎలాంటి సహాయం కావాలన్నా తనకు తెలియజేయాలని సూచించారు. ప్రజా జీవితంలో గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులను ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్,సర్పంచ్ వాణి రవికుమార్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి, సమ్మెట మహేందర్ గౌడ్, డీసీసీ సెక్రెటరీ రాయరాపు సాంబయ్య, ఎలీషా, నాగలక్ష్మి, లక్ష్మణ్ రావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
