ఉపాధి హామీ కూలీ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేత
ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సల్ల సమ్మయ్య ఉపాధి హామీ పథకం పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సమ్మయ్య మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో అండగా ఉండటంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందిన ఈ ఆర్థిక సహాయం కొంతవరకు తోడ్పాటుగా నిలుస్తుందని పేర్కొన్నారు.బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈగ దామోదర్, ఏఎంసీ మాజీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూల్ల రవి, పలువురు సీనియర్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
