కూటమి విజయంతో కోదాడలో తెదేపా శ్రేణుల సంబరాలు

Sakshitha news

కూటమి విజయంతో కోదాడలో తెదేపా శ్రేణుల సంబరాలు

సూర్యాపేట జిల్లా / కోదాడ, సాక్షిత :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన సందర్భంగా కోదాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాయి.

కోదాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు కట్టా సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీ మాజీ ఇన్‌చార్జి ఓరుగంటి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ, బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సాధించిన విజయం ప్రజల నమ్మకానికి, మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘జై తెలుగుదేశం’, ‘ఎన్టీఆర్ అమర్ హై’ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గురవయ్య, బాలకృష్ణ, శోభన్ బాబు, రేవంత్ రెడ్డి, సురేష్, ఉపేందర్ గౌడ్, రాఘవయ్య, ఆశిష్, అనిల్, నాగేశ్వరరావు, వెంకట్రావు, మాధవరావు, ఆఫీజ్, ఆంజనేయులు, నవీన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.