కార్మిక రంగానికి వెన్నుదన్నుగా బిఆర్టియు

Sakshitha news

కార్మిక రంగానికి వెన్నుదన్నుగా బిఆర్టియు..

జెకె ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు బిఆర్టియులో చేరిక..

కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఆర్టియును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు..

పటాన్చెరు

కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్టియుకు రోజురోజుకూ కార్మికుల నుంచి ఆదరణ పెరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. జెకె ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్టియు లో చేరారు. కార్మికులందరికీ కార్మిక సంఘం కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం బిఆర్టియు నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల సాధనకు బిఆర్టియు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు రావాలని సూచించారు.

త్వరలో జరగనున్న పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల మద్దతుతో బిఆర్టియు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, కార్మికులు శ్రీనివాస్, ఆదినారాయణ, మహేందర్ రెడ్డి, సూర్యచంద్ర రావు, మల్లేష్, వెంకటేష్, అర్జున్ రావు, సంగమేశ్, శివ కుమార్ రెడ్డి, రమణ, రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.