ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు : పద్మారావు గౌడ్

Sakshitha news

ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : అర్హులైన పట్టభద్రుల ఓటర్ల పేర్లను కచ్చితంగా నమోదు చేసేలా ఏర్పాట్లు జరపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. వారాసిగుడా లోని రెడ్ క్రాస్ హాస్పటల్ వద్ద మంగళవారం గ్రాడ్యుఎట్ ఓటర్ల నమోదు శిబిరాన్ని పద్మారావు గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు కార్యక్రమo నత్తనడకన సాగుతోందని, ఆన్లైన్ లో కూడా తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. సికింద్రాబాద్ లోని 8 మునిసిపల్ వార్డుల్లో పట్ట భద్రుల ఓటర్ల నమోదును ముమ్మరం చేశామని తెలిపారు. అర్హులైన అందరు పట్టభద్రుల పేర్లను నమోదు చేయించాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్. యువ కిశోర్ కుమార్, మాజీ కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి నాయకులు పాల్గొన్నారు.