నాచారం డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు

Sakshitha news

నాచారం డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు

రూ.2.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులకు శ్రీకారం

నాచారం డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సుమారు రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మంగళవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వివిధ కాలనీల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత బై లైన్ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు:

  1. హనుమాన్ నగర్: అంతర్గత నూతన బై లైన్ రోడ్ల నిర్మాణం – రూ.39.30 లక్షలు.
  2. సంస్కృతి హిల్స్ కాలనీ: నూతన గ్రౌండ్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం – రూ.44 లక్షలు.
  3. భక్త సమాజం నుంచి CDS బిల్డింగ్ వరకు: నూతన సీసీ రోడ్డు నిర్మాణం – రూ.24.60 లక్షలు.
  4. నూతన వార్డు కార్యాలయం నుంచి భక్త సమాజం వరకు: నూతన సీసీ రోడ్డు నిర్మాణం – రూ.14.80 లక్షలు.
  5. భవాని నగర్: మెయిన్ రోడ్డు నుంచి హనుమాన్ టెంపుల్ వరకు 600 MM డయా స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్‌లైన్ నిర్మాణం – రూ.65 లక్షలు.
  6. శ్రీనగర్ కాలనీ: మెయిన్ రోడ్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణం – రూ.57.60 లక్షలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, నాచారం డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మంజూరైన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్,మేడల మల్లికార్జున్ గౌడ్, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు,స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధికారులు పాల్గొన్నారు.