కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఆత్మీయ సమావేశం

Sakshitha news

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఆత్మీయ సమావేశం

పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా చైర్మన్ గుండు సుధారాణి, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎండి మాయుబ్ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం వంటి అంశాలపై చట్టసభల్లో సమర్థవంతంగా మాట్లాడగల నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందన్నారు. విద్యావంతులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైనదని, ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా విద్యారంగం, యువత భవిష్యత్తుకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులు తమ మద్దతు తెలియజేసి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు. విద్యావంతులు, యువత భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయాలని, విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.