హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, PAC చైర్మెన్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ ఆదేశానుసారం, నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను త్వరితగతిన జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.
ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, PAC చైర్మెన్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
