ప్రజావాణి ని నిర్వహించాలని సిపిఐ మరియు జనసేన నాయకులు ధర్నా.

Sakshitha news

ప్రజావాణి ని నిర్వహించాలని సిపిఐ మరియు జనసేన నాయకులు ధర్నా.
ప్రతి సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి దూరప్రాంతాల నుండి ప్రజలు వెళ్లవలసి రావడం వల్ల వారికి ఇబ్బంది కలగకుండా స్థానిక రెవెన్యూ అధికారి కార్యాలయంలోని ప్రజావాణి నిర్వహించాలని గత మూడు నెలల క్రితం జీవో జారీ చేసినప్పటికీ కు రెవెన్యూ కార్యాలయంలో అధికారికంగా ప్రజావాణి నిర్వహించకపోవడం వల్ల నేడు సిపిఐ మరియు జనసేన పార్టీలో ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


గత వారం మరియు గత నెల క్రితం కూడా ప్రజావాణి నిర్వహించాలని వినితిపత్రం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం వల్లే నేడు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాల్సి వచ్చిందని, ప్రజావాణి ఉండడం వల్ల ప్రజల తమ సమస్యలను నేరుగా అధికారులను కలిసి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో ప్రజలు ఉంటారని కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజావాణి కార్యక్రమం అనుకున్నంత మేరకు విజయం సాధించలేకపోతుందని దానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్మమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల పైన హైకోర్టు తీర్పునిచ్చి నెలలు గడిచినప్పటికీ నేటికీ చర్యలు తీసుకోకపోవడం అదేవిధంగా జగద్గిరిగుట్ట మరియు గాజులరామారంలో అనేక భూకబ్జాలను కొనసాగుతున్నాయని వాటన్నిటిని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్మార్వో బైరెడ్డి రాజేష్ కి వినతి పత్రం ఇచ్చి కచ్చితంగా ప్రజావాణి నిర్వహించాలని డిమాండ్ చేయగా వారు నిర్వహిస్తామని అన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ జనసేన అధికార ప్రతినిధి నల్లగిరి సతీష్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం మండల కార్యదర్శి కే స్వామి సహాయ కార్యదర్శి హరినాథ్ రావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మీ శ్రీనివాస్ సిపిఐ నాయకులు కే వెంకటేష్ సదానంద, సహదేవరెడ్డి శ్రీనివాస్ చారి, మల్లేష్, ఇమామ్ యువజన సంఘం నాయకులు కీర్తి ,ప్రవీణ్, నరసింహ, జనసేన నాయకులు దుర్గాప్రసాద్,నవీన్,మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.