దుబాయిలో బతుకమ్మ & దసరా సంబరాలు.. ప్రభుత్వ బాషా సంస్కృతిక శాఖ సౌజన్యం తో మార్మోగిన బతుకమ్మ ఆటా పాట. దుబాయ్ లోని “వుడ్ లెం” స్కూల్ ఆవరణలో తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు, పెద్ద ఎత్తున బతుకమ్మ ను పేర్చి పల్లెపాటలు ఆలపించారు..తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఎన్నారై అడ్వైజర్ బోర్డు మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి సారాధ్యంలో మరియు ఎన్ఆర్ఐ అడ్వైజర్ బోర్డు మెంబర్ సత్యం గౌడ్ పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలరాజ్ గౌడ్ నేతృత్వంలో దుబాయ్ లో బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద , మాజీ ఉమెన్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి , తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎర్రబెల్లి స్వర్ణ , NRI అడ్వైసరి బోర్డు మెంబెర్ నంగి దేవేందర్ రెడ్డి మరియు బాషా సాంస్కృతిక శాఖ ప్రభుత్వ సలహా మండలి సభ్యులు డా. దరువు ఎల్లన్న పాల్గొన్నారు, దుమ్ము లేపిన ఆట పాటలు డా దరువు ఎల్లన్న ( బాషా సంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు) సాంస్కృతిక సారధి కళాకారులు,మా పల్లె శంకర్, సోని యాడర్ల, సోని పటేల్ తదితరులు పాల్గొని కన్నుల పండుగలాగా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు,
ఆట పాటలతో వేదిక కొత్త వన్నె సంతరించుకుంది.. ఒగ్గు డోలు చెప్పుళ్లతో.. డప్పుల దరువులతో సభా ప్రాంగానం అంత మారుమోగిపోయింది.చెప్పట్లతో బతుకమ్మలు ఆడుతు ఆడ పడుచులు సంబురపడ్డారు..ఈ కార్యక్రమానికి దుబాయి కాన్సిలెట్ జనరల్ అంకిత వాక్కెకర్ ,ప్రత్యేక ఆహ్వానితురాలుగా పాల్గొని బతుకమ్మ ఆడుతు… మురిసిపోయారు .ఆకట్టుకున్న అతిథుల ప్రసంగాలు తెలంగాణ నుండి ముఖ్య అతిథి గా పాల్గొన్న నేరెళ్ల శారద మాట్లాడుతూ.. ప్రపంచంలో అన్ని దేవుళ్ళను పువ్వులతో కొలిస్తే పువ్వులని దేవుళ్ళుగా కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణకే దక్కిందని, ఉన్న ఊరును వదిలేసి దుబాయ్ కి వచ్చిన బిడ్డలందరూ వారి సొంత సంస్కృతిని సాంప్రదాయాలను మరచిపోకుండా బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుందని కార్యక్రమాన్ని నిర్వాహకులను కొనియాడారు. బండ్రు శోభారాణి గారు మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ తెలంగాణ నుండి పొట్ట చేత పట్టుకొని వచ్చిన బిడ్డలు ఇవాళ గొప్ప స్థాయిలో ఎదిగి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను విస్తరింప చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేశారు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు మాట్లాడుతూ మొదటిసారి నేను విదేశాల్లో బతుకమ్మకు హాజరు కావడం కానీ ఇది విదేశాల్లో జరుగుతున్నట్టు లేదు తెలంగాణ గడ్డమీదనే బతుకమ్మ సంబరాలు జరుగుతున్నంత ఆనందంగా ఉందని తెలియజేశారు, ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు గత కొన్ని సంవత్సరాలుగా నాకు స్వయంగా తెలుసు అంటూ వారి కష్టాలను చూసి కన్నీళ్లను తుడిచే నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం దుబాయ్ లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు దురదృష్టవశాత్తు ఎవరు చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల మృత ధన సహాయాన్ని అందించడం గర్వకారణం అని నంగి దేవేందర్ రెడ్డి తెలియజేశారు అతి త్వరలో ఎన్నారైల కోసం గల్ఫ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో కవి గాయకుడు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ సలహా మండలి సభ్యులు డాక్టర్ దరువు ఎల్లన్న మాట్లాడుతూ నాడు వలస కార్మికులు నేడు ప్రవాస భారతీయులు అని తెలంగాణ రాకముందు గల్ఫ్ కార్మికులు పడిన కష్టాల గురించి తాను రాసిన పాట ను పాడి వినిపించి భావోద్వేగానికి గురయ్యారు, ఇప్పుడిప్పుడే తెలంగాణ బిడ్డలు వ్యాపారవేత్తలుగా కంపెనీ యజమానులుగా న్యూ ఎంటర్ప్రైన్లుగా మారడం రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని గల్ఫ్ ప్రవాస భారతీయులను కొనియాడారు. దరువు ఎల్లన్న తన మాట పాటతో దుబాయ్ లో ఉంటున్న వారిని వారి సొంత ఇండ్లలో బతుకమ్మ ఆడుకుంటున్న ఆనందాన్ని కల్పించారు, సత్యం గౌడ్ మాట్లాడుతూ దుబాయ్ లో ఉంటున్న తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అండగా ఉంటామని ఎవరికి ఏ కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని గల్ఫ్ కార్మికులకు ప్రవాస తెలంగాణ బిడ్డలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో తెలంగాణ ప్రముఖులు తోట రామ్ కుమార్ , రామచంద్ర రెడ్డి రాధారపు సత్యం గారు, ప్రియా సింగి రెడ్డి , హకీమ్ , రాజా శ్రీనివాస్ , సురేంద్ర పటేల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
