సాయి మందిరంలో పూజలు.. అన్నదాన కార్యక్రమం…
సాక్షిత సూర్యాపేట జిల్లా/ కోదాడ : కోదాడ మండలం నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్ సమీపంలో గల సాయి మందిరంలో చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. నల్లపాటి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు తమ కుమార్తెలు మౌనిక, భవానీ తేజ, కుమారుడు చైతన్య కృష్ణ లు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ,, మండల పార్టీ అధ్యక్షులు అలసకాని శరబేశ్వరరావు, రంగారావు, ఆదినారాయణ, రామారావు, నల్లపాటి లింగారావు, ఈదర వెంకటేశ్వర్లు, నరసింహారావు గురువయ్య, ముండ్రా రామారావు, పూర్ణ, శ్యామ్ పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
