సాయి నగర్ ఆలయ పరిధిలో CMC నిధులతో రూ. 20 లక్షల సీసీ రోడ్డు ప్రారంభం

Sakshitha news

సాయి నగర్ ఆలయ పరిధిలో CMC నిధులతో రూ. 20 లక్షల సీసీ రోడ్డు ప్రారంభం ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రగతి నగర్ 276వ డివిజన్ పరిధిలోని సాయి నగర్ ఆలయ ప్రాంతంలో CMC నిధులతో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్డును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు.

కాలనీ అభివృద్ధిలో భాగంగా CMC నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, CMC నిధులతో కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

అనంతరం భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచిన కలాం సేవలను, దేశాభివృద్ధికి ఆయన అందించిన కృషిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి), మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, 277వ డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్, గజ్జెల కాంతం, కూతురు నిర్మల, ప్రవీణ్ (లడ్డు), మల్లికార్జున్, శ్రీ నవీన్ రెడ్డి, వీరబాబు, సురేందర్ యాదవ్, పిల్లి ఆంజనేయులు, మురళి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల అవసరాలే ప్రాధాన్యం – అభివృద్ధే మా లక్ష్యం!