మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి

Sakshitha news

మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ , వీరేందర్ గౌడ్ , డా. ఎస్. మల్లారెడ్డి , జయశ్రీ విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు రావుల పృథ్వి , శ్రీనివాస్ రెడ్డి , శారద , నరేష్ గౌడ్ , సాయి ప్రతాప్ , వీరాచారి , మంజునాథ్ తదితరులతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడంపై ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.