BRS ఎమ్మెల్సీ అభ్యర్ధులపై కసరత్తు.. పోటీలో ఉన్నది వీరే!
BRS ఎమ్మెల్సీ అభ్యర్ధులపై కసరత్తు.. పోటీలో ఉన్నది వీరే!
తెలంగాణ : రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. HYD-రంగారెడ్డి-MBNR, WGL-ఖమ్మం-NLG ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించింది. BRS కూడా అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. WGL-KMM-NLG ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనుగుల రాకేష్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. HYD-RR-MBNR స్థానం కోసం బీసీ నేతలు కాసాని వీరేశ్ ముదిరాజ్, జి.నాగేందర్ గౌడ్, రవీందర్ యాదవ్ తదితరులు రేసులో ఉన్నారు. జి.నాగేందర్ గౌడ్ పేరును పార్టీ పరిశీలిస్తోన్నట్లు సమాచారం.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
