గణనాథుడి భక్తి మనలో సేవా భావాన్ని పెంచాలి.. యువతలోని శక్తి సమాజానికి ఉపయోగపడాలి

Sakshitha news

గణనాథుడి భక్తి మనలో సేవా భావాన్ని పెంచాలి.. యువతలోని శక్తి సమాజానికి ఉపయోగపడాలి:: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ .

ఉయ్యూరు శివాలయం సెంటర్లో గణేష్ నిమజ్జనం ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనంతరం సుందరమ్మపేటలో ఏర్పాటు చేసిన భారీవినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ……

వినాయక నవరాత్రులు యువతలోని భక్తి ఐక్యత సేవా భావాన్ని వెలికి తీసే వేదికగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా… గణనాథుడి ఆశీస్సులతో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుండాలని రాజేంద్రప్రసాద్ అన్నారు.

గణపతికి పూజ చేయడం ఎంత పవిత్రమో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కూడా అంత పవిత్రమయిన సేవా అని అన్నారు.

యువతలో భక్తితో మొదలైన అడుగు సేవగా మారాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.

ఈ కార్యక్రమంలో వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, రత్నం బుజ్జి, జంపన శ్రీనివాస్,మేడిశెట్టి మస్తాన్ పోగిరి రాము, కూనప రెడ్డి ప్రసాద్, దాసు శ్రీనివాసరావు, గుర్రాల సాయి, నరేష్, ప్రసాద్,పైల శీను, కరిమిజి రమణ, పారుపూడి సుబ్బారావు, మొదలగు వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.