బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ నున్న పోలీస్ స్టేషన్ సిఐ SK . అహ్మద్ ఆలీ అకస్మాత్తుగా మరణించడం అత్యంత బాధాకరం
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులు నున్న PS సీఐ ఎస్.కె. అహ్మద్ అలీ కి ఘనంగా జోహార్లు అర్పిస్తున్నాం..
-- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం, NTR జిల్లా, విజయవాడ
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఎటువంటి అనుమతులు లేకుండా ధర్నా చేసేందుకు ప్రయత్నించిన సచివాలయ ఉద్యోగులను శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపడుతూ.. విధులు నిర్వర్తిస్తున్న సిఐ సచివాలయ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అల్లరిమూకలు సృష్టించిన విధ్వంసకర పరిస్థితులను నియంత్రిస్తూ.. విధినిర్వహణలో ఒత్తిడికి గురై ఆకస్మికంగా ప్రాణాలు వదలడం అత్యంత దురదృష్టకరం
విజయవాడ పోలీస్ కమిషనరేట్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న నున్న పోలీస్ స్టేషన్ సీఐ ఎస్కే అహ్మద్ అలీ హఠాన్మరణం యావత్ పోలీస్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది
విధి నిర్వహణలో తుది శ్వాస విడిచిన నున్న పోలీస్ స్టేషన్ సీఐ ఎస్ కే అహ్మద్ అలీ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము
ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ సీఐ SK . అహ్మద్ ఆలి కుటుంబానికి అన్ని విధాల అండదండలు అందిస్తామని హామీ ఇచ్చిన విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ S.V.రాజశేఖర్ బాబు,IPS కి మరియు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారు మానసికస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు చర్యలు గైకొన్న డిసిపి అడ్మిన్ శ్రీమతి కేజీవి సరిత, IPS కి పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నది


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
