మంజాల తిమ్మయ్య మృతికి కూన శ్రీశైలం గౌడ్ సంతాపం

Sakshitha news

మంజాల తిమ్మయ్య మృతికి కూన శ్రీశైలం గౌడ్ సంతాపం

కుత్బుల్లాపూర్: రంగారెడ్డి నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంజూల్కర్ తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంజాల తిమ్మయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గాంధీ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి తిమ్మయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన కూన శ్రీశైలం గౌడ్ .. తిమ్మయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.