RGK 103 బ్లాక్ వద్ద UGD సమస్య పరిష్కారానికి వారాల వినోద్ కుమార్ పాదయాత్ర
292 డివిజన్ సాయిబాబా నగర్ RGK 103 బ్లాక్ దగ్గర కొంతకాలంగా UGD సమస్య తీవ్రంగా ఉండడంతో బ్లాక్ వాసులు స్థానిక సీనియర్ నాయకులు శ్రీ వారాల వినోద్ కుమార్ కి సమస్యను తెలియజేయడం జరిగింది.
వెంటనే స్పందించిన వినోద్ కుమార్ 103 బ్లాక్ దగ్గరకు వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా RGK లో 1 నుండి 14 వరకు ఉన్న అన్ని బ్లాకులలో UGD లైన్ సమస్యలు ఉండడంతో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సమస్యను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ K.P. వివేకానంద దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, రాజు యాదవ్, రంగప్ప, బద్రి, జై సింహా రెడ్డి, నరసింహ గౌడ్, జహీర్, జగన్, కిరోసిన్ శీను, మహిళలు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST