రక్షాబంధన్ పర్వదినాన కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు.
దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ బంగారం ఉత్పత్తి సంస్థగా ఉన్న హట్టి గోల్డ్ మైన్స్‌లోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. బంగారం ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సగటున 2 నుంచి 4 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుందని అధికారులు వివరించారు.
సింగరేణి వేలంలో దక్కించుకున్న దేవదుర్గ బంగారం–రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్‌కు సమీపంలోనే ఉండటంతో, భూగర్భ గనితో పాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా భట్టి విక్రమార్క పరిశీలించారు.
హట్టి గోల్డ్ మైన్స్‌లోని అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విధానాలు సింగరేణి చేపట్టనున్న దేవదుర్గ బంగారం–రాగి ఖనిజ అన్వేషణకు ఉపయోగపడనున్నాయి.
సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా బంగారం, రాగి వంటి కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
