రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ

Sakshitha news

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ..

“అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ, మహిళలకు రక్షణ, గౌరవం కల్పించే గొప్ప సంప్రదాయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, అమ్మ ఆరోగ్యం ద్వారా ప్రతి మహిళకు ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటి పథకాలతో మా ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు అన్నగా, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

Scroll to Top