పంచాయతీరాజ్ అధికారులపై చర్యలు తీసుకోండి

Sakshitha news

పంచాయతీరాజ్ అధికారులపై చర్యలు తీసుకోండి..
పంచాయతీరాజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మా నిటరింగ్ కమిటీ మెంబర్ నాగరాజు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో కృష్ణరావుపేట నుండి మిట్ట కందాల వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తారు రోడ్డు మంజూరు అయితే తారు రోడ్డును తూతు మంత్రంగా వేసి పది కిలోమీటర్ల మేర ఒక్క కల్వర్టు కూడా నిర్మించినందుకు రైతుల పొలాలు వర్షాకాలంలో నీట మునిగిపోతున్నాయని పంచాయతీరాజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారన్నారు. అలాగే మద్దూరు గ్రామ ఎస్సీ మాదిగ కాలనీకి ఏళ్లు తర బడుతున్న దారి చూపడం లేదని వెంటనే దారి చూపాలని డిమాండ్ చేశారు మిట్ట కందాల గ్రామంలో వాడాల మద్దూరు పోయే రూటు లో మురుగు నీరు లేకుండా కల్వర్టు నిర్మించాలని గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దన్న ఇమ్మానీయులు రాజు తదితర మద్దూరు ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top