చినుకులు పడితే రోడ్డంతా రొచ్చురొచ్చు.

Sakshitha news

చినుకులు పడితే రోడ్డంతా రొచ్చురొచ్చు.

కోవూరుఎమ్మార్వో సుబ్బయ్యకు వినతిపత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు

పాటూరు పల్లి పాళెం నుండి యల్లాయపాళెం వెళ్లాలంటే దారి పొడవున చినుకు పడితే రొచ్చుగా మారింది. ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందించిన సిపిఎం నాయకులు అనంతరం వారుమాట్లాడుతూ.. నిరంతరం ఈ రహదారి వెంట సైకిళ్లపై చిరువ్యపారులు కూరగాయలు.ఆకుకూరలు పలుగ్రామాలకు తీసుకువెళ్లి అమ్ముకునే పేదలు జీవనం సాగిస్తున్నారు.రైతులు వరికోతలుకోస్తే వడ్లురాశి వద్దకు ట్రాక్టర్ ద్వార తోలుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.పల్లిపాళెం చెంచమ్మ కాలనీ.

చక్రాల దిబ్బ నుండి సైకిళ్లపై నిరంతరం విద్యార్థులు ఎల్లయపాలెం హైస్కూల్ విద్యను అభ్యసించుటకువిద్యార్థులు వెల్లాలంటే వర్షము పడినప్పుడు స్కూలు పుస్తకాలు వర్షపునీళ్ల గుంటలో పడి ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇదే రహదారి ద్వారా యలాయపాళెం నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు ఎక్కి భవన నిర్మాణ కార్మికులు షాపింగ్ మాల్స్ లోకి చిరు ఉద్యోగులు ప్రయాణం చేయవలసి ఉన్నది. చినుకులు పడడంతో ఈ రోడ్డు మరింత రొచ్చు రొచ్చగా మారిపోయింది ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై వేసిన మట్టిని తొలగించి అసౌకర్యానికి గురవుతున్న ప్రజలకు సిమెంట్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాము. పైకార్యక్రమములో గండవరపు శేషయ్య. విజయ్ కుమార్. రమేష్. సురేష్. రామయ్య. కాలేషా.శ్రీనయ్య. ఛాను భాష.హరి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top