ఆలయ భూములను పరిరక్షించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.
ఆలయ భూముల పరిరక్షణ కమిటీ పిలుపు.
జగద్గిరిగుట్టలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 14 ఎకరాల 10 గుంటల భూమి ని కాపాడాలని కోరుతూ నేడు అఖిలపక్షల ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట చివరి బస్టాండ్ లో రిలే నిరాహార దీక్షను కొనసాగించడం జరిగింది.
ఈ రిలే నిరాహార దీక్షలను సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం గారు ప్రారంభించగా దీక్షలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ జనసేన అధికార ప్రతినిధి సతీష్ బిజెపి నాయకులు మాధవులు టీజేఎస్ నాయకులు ఎర్రవీరన్న కార్మిక నాయకులు దుర్గయ్య లు కూర్చోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించి దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకునేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని అందులో భాగంగానే నేడు నిరాహార దీక్షలో కూర్చున్నామని ఒకవేళ అధికారులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తే అధికారులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 12 వారాల్లోనే సర్వే నిర్వహించాల్సిందిగా ఉన్నప్పటికీ గత నెల రోజుల నుండి ఎమ్మార్వో గారికి మరియు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ వారు పట్టించుకోకపోవడం హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకపోవడమేనని వచ్చే వారం రోజుల్లో సర్వే నిర్వహించకపోతే హైకోర్టులో వారు దోషులుగా నిలబడాల్సి వస్తుందని అన్నారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని ప్రజలను చైతన్యవంతం చేసి భూములను కాపాడుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, రాములు కోశాధికారి సదానంద ప్రజానాట్య మండల అధ్యక్షులు బాబు యువజన కార్యదర్శి వెంకటేష్ ఎం సిపిఐ నాయకులు రవీందర్ గౌడ్ జనసేన నాయకురాలు అనుపమ మహేష్ ఆకుల సతీష్ టీం ఆకుల సతీష్, జయశంకర్ గౌడ్, పులిబలరామ్ సిపిఐ నాయకులు వెంకటేష్, సోమయ్య, ఇమామ్ జంబు చంద్రయ్య, శ్రావణ్,ఉపేందర్ లతోపాటు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
