కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో సామినేని ఉదయభాను

Sakshitha news

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట: పట్టణంలోని పాలేటి ఒడ్డున వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయాన్ని సంపూర్ణ కృష్ణశిలతో అత్యంత వైభవంగా పునర్నిర్మిస్తున్నారు.

ఈ పునర్నిర్మాణంలో భాగంగా నాలుగు ప్రధాన ద్వారబంధముల ప్రతిష్ఠ, యంత్ర స్థాపన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ప్రాచీన ఆలయాల పరిరక్షణతో పాటు వాటి వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉదయభాను గారు పేర్కొన్నారు.

Scroll to Top