గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య బలం….

Sakshitha news

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య బలం….

40 మంది వైద్య సిబ్బంది నియామకం.. వైద్య సేవలు మరింత బలోపేతం….

–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,గోదావరిఖని// : ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 40 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

నియమితులైన వారిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. వీరి నియామకంతో ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో వైద్య సిబ్బంది అందుబాటు పెరగడంతో పాటు రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
వైద్య సిబ్బంది నియామకంతో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, యూరాలజీ, ఓబీజీవై, ఆఫ్తాల్మాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ తదితర విభాగాలకు వైద్య బలం చేకూరనుంది.

ప్రొఫెసర్‌గా డా. పవన్ కుమార్ (సైకియాట్రీ), సీనియర్ రెసిడెంట్లుగా డా. సాయి తరుణ్య, డా. సత్య శ్రీ, డా. జె.పి. మౌనిషా నియమితులయ్యారు. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను కూడా నియమించారు.

ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు చేపట్టిన ఈ నియామకాలతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటు మరింత పెరిగి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

Scroll to Top