వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి నారా లోకేష్‌ ఘన నివాళులు

Sakshitha news

వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి నారా లోకేష్‌ ఘన నివాళులు

రాజధానిలోని వెంకటపాలెంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ మహానేత, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ సేవలను, ఆయన అందించిన ప్రజా సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ,పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం నారా లోకేష్‌ తో పాటు నాయకులు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు.

Scroll to Top