మెరుగైన వీధి దీపాల కోసం స్థానికుల చొరవ అభినందనీయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Sakshitha news

మెరుగైన వీధి దీపాల కోసం స్థానికుల చొరవ అభినందనీయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్ మల్లంపేట్ సాయి బాలాజీ కాలనీలో తమ ప్రాంతంలో వెలుతురు మరియు భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, కాలనీ నివాసితులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న వీధి దీపాలను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. అనంతరం కాలనీ సభ్యులకు విధి దీపాలను సంబంధిత మెటీరియల్ ను పంపిణీ చేశారు, కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అవసరాన్ని గుర్తించి, అందరూ కలిసి చొరవ చూపినందుకు నివాసితులను అభినందించారు.

ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడంలో మరియు నివాసితులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో సామాజిక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని వారు అన్నారు. సమిష్టి కృషి చేసిన సాయి బాలాజీ కాలనీ ప్రజలను అభినందించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, అర్కల అనంతస్వామి ముదిరాజ్, కాలనీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, కాలనీ సభ్యులు భూపాల్ రెడ్డి, శ్రావణ్, రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ, శేఖర్, రమేష్, నరేష్, సాయి, శివకాంత్, స్థానిక నివాసితులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు..

Scroll to Top