గాంధారి ఖిల్లా మైసమ్మ దర్శనానికి బయలుదేరిన మహిళలకు శుభాకాంక్షలు….
మొక్కులు తీర్చుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించిన శ్రీమతి మనాలి ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి’ రామగుండం/
రామగుండం నియోజకవర్గంలోని తిలక్‌నగర్‌కు చెందిన మహిళా సమైక్య సభ్యులు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో మహిళలు యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి, మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్‌పర్సన్ శ్రీమతి మనాలి ఠాకూర్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభింపజేసి వారిని సాగనంపారు.
మైసమ్మ తల్లి అనుగ్రహంతో యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


