వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షఫీని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం

Sakshitha news

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షఫీని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజద్ భాషా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి శ్రీ షఫీ గారు అనారోగ్యంతో కడప నగరంలోని ఏషియన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్.బి. అంజద్ భాషా గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు శ్రీ కే. సురేష్ బాబు గారు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శ షేక్ ఉమైర్ గారు, ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా షఫీ గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అంజద్ భాషా గారు, ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అలాగే షఫీ గారికి ధైర్యం చెప్పి, అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, రాయలసీమ జోన్ పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, నాయకులు నరసింహ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు

Scroll to Top