100వ వారంలోకి రైతు నేస్తం.. రైతులకు మరింత చేరువ కావాలి

Sakshitha news

100వ వారంలోకి రైతు నేస్తం.. రైతులకు మరింత చేరువ కావాలి….

–కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : రైతులకు ఆధునిక సాగు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణపై నిరంతర అవగాహన కల్పిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా 99 వారాలు పూర్తి చేసుకుని 100వ. వారంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వారం వ్యవసాయ నిపుణులు రైతులకు అందిస్తున్న సాంకేతిక సూచనలు వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపీ, ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా జిల్లాలో వివిధ వ్యవసాయ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు.

సన్మానం పొందిన రైతులు:
మాదాసు భూమయ్య (పాలకుర్తి) – బహుళ పంటల సాగులో ప్రతిభ.జునేని శ్యాంసుందర్ రావు (శివపల్లి, ఎలిగేడు) – ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ రైతు.
గుర్రాల రాజయ్య (గుండారం, కమాన్‌పూర్) – ఆయిల్‌పామ్, కాజురినా అంతర పంటల సాగులో ఆదర్శ రైతు.సన్మానం పొందిన వ్యవసాయ విస్తరణ అధికారులు:ఎం. ఈశ్వర్ రెడ్డి – ఏఈఓ, శ్రీరాంపూర్.
ప్రత్యూష – ఏఈఓ, మంథని.అనంతరం పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవనం స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, నిర్మాణ పనులకు సంబంధించిన పలు సూచనలు అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, అదనపు సంచాలకులు శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top