గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవం…
జ్యోతి గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, మహిళా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన జ్యోతి గాంధీ స్మారక పురస్కార ప్రదానోత్సవం గోదావరిఖనిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేసి విజేతను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జ్యోతి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రైజింగ్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఎలా సంపాదించుకుందో, అదే విధంగా గాంధీగిరి వార్తలు కూడా వేగవంతంగా ప్రజలకు చేరువగా వార్తలను అందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీగిరి వార్తల నిర్వాహకుడు దయానంద్ గాంధీని అభినందించారు.
స్థానిక యువత వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి గోదావరిఖని ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
