ప్రతి పేదోడు కళ్ళల్లో వెలుగును నింపుతున్న విపిఆర్ నేత్ర-కొల్లారెడ్డి బ్రదర్స్.
సాక్షిత :కంటి చూపే ప్రతి ఒక్కరికి మూలం అట్లాంటి కంటి చూపుని ప్రతి ఒక్కరికి అందిస్తున్న వి.పి.ఆర్. నేత్ర.కోవూరు ఇనమడుగు గ్రామంలో ‘వి.పి.ఆర్. నేత్ర’ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుతమైన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. అలాగే నిన్న, ఇనమడుగు గ్రామంలో ముందుచూపు వారికి, దూరపు చూపు వారికి వీళ్ళందరికీ సంబంధించి నిన్న ఒక్కరోజే 410మందికి పైగా చూడడం జరిగింది. 350 మందికి అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. 170 మందికి పైగా చూడడం జరిగింది ఈరోజు కూడా 400ల మంది పైనేఎంతమంది వచ్చినా రాత్రి 9 అయిన వారికి ఆరోగ్యరిత్తే చూచి, మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపించమని తెలియజేశారు. అలాగే 1వ తేదీ జిమ్మీ పాళెం గ్రామంలో, 2వ తేదీ చెర్లోపాళెం గ్రామం, 3వతేదీ లేగుంటపాడు, 4వ తేదీ పోతిరెడ్డి పాళెం, పెట్టడం జరుగుతుందని తెలిపారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని చూడడం జరుగుతుందని తెలియజేశారు. మా గ్రామానికి పంపించి మా ప్రజల ఆరోగ్యం కాపాడుతున్న “వి.పి.ఆర్. దంపతులకు” ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ప్రజల ముందుకు తీసుకోవాలని తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇనమడుగు ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, బిజెపి నాయకులు నల్లగట్ల శ్రీహరి, పోలిశెట్టి నాగేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు తోట రామచంద్రారెడ్డి, ఇసనాక కోదండరామిరెడ్డి, ఎరటపల్లి రవి రెడ్డి, చింతలపూడి పెంచలయ్య, షేక్. సుభాన్ భాష, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
