తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెంట సంపత్ కుమార్ నీటి పారుదల ప్రాజెక్టుల సందర్శన…!
ముఖ్యమంత్రి తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ జిల్లాకి బయలుదేరిన అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో భాగంగా సోమశిల నిన్న రాత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ అధికారులు లతో కలిసి రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటు కొరకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటే ఉంటూ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు మల్లమ్మ కుంట ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తున్న మన అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని అనంతరం అక్కడినుంచి బయలుదేరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి అనంతరం అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర పంప్ హౌస్, వట్టెం ఇరిగేషన్ టన్నెల్ ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ నిన్నటి నుంచి నేటి వరకు నీటిపారుదల ప్రాజెక్టుల సమీక్షలు సందర్శన సమావేశాలలో అన్నింటిలో పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
