జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్లకు, పెట్రోల్ డీజిల్ కు ఎలాంటి కొరత లేదు
ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి :
జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు గాని పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదనీ ప్రజలు వదంతులు నమ్మి ప్రస్తుత అవసరం లేకున్న ముందస్తు కొనుగోలుకు ప్రయత్నం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో అవసరానికి అనుగుణంగా పెట్రోల్, గ్యాస్ నిలువలు ఉండటంతో పాటు అవసరానికి మించి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలతో పాటు వనపర్తి జిల్లాకు ఎప్పటికప్పుడు డిమాండుకు అనుగుణంగా సరఫరా అవుతున్నాయని, భవిష్యత్తులో సైతం ఎలాంటి కొరత ఏర్పడటానికి అవకాశం లేదన్నారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ప్రస్తుతం అవసరం లేకున్న అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల మాత్రమే సమస్యలు వస్తాయని తెలిపారు.
ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల సరఫరా సైతం పెంచడం జరిగిందన్నారు.
ప్రజలు వదంతులు నమ్మవద్దని, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కు జిల్లాలో ఎలాంటి లోటు లేదని తెలియజేశారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
