మోడల్ గ్రేవ్ యార్డ్ గా కళావతి నగర్ స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తాం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
129 – సూరారం డివిజన్ కళావతి నగర్ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కళావతి నగర్ హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు ఎన్ని నిధులైన కేటాయించి మోడల్ గ్రేవ్ యార్డ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. మనిషి జీవితంలోని చివరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహించేందుకు స్మశాన వాటికలో చేపట్టవలసిన మౌలిక వసతులను అన్నింటిని కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిఈ అనురాగ్, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, స్థానిక సంక్షేమ సంఘం నాయకులు రజితా రత్నం, సదానందం గౌడ్, హరినాథ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కోలా శ్రీకాంత్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీనారాయణ, కెపి.వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
