పర్యావరణానికి అనుకులంగా హోలీ జరుపుకుందాము…………
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ
భారతీయ పండుగలలో ముఖ్యమైన పండుగ హోలీ.వసంత రుతువులో రంగుల పండుగ గా జరుపుకుంటారు. ఈ పండుగ చరిత్ర పురాతన
హోలీ వెనుక ఉన్న ప్రధాన పౌరాణిక గాధలు మరియు చారిత్రక అంశాలు
ప్రహ్లాదుడు మరియు హోలిక దహనం
చెడుపై మంచి విజయం అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ప్రకారం, హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా భావించేవాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని భక్తుడిగా మారాడు.
ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయం కోరాడు. మంటల్లో కాలకుండా వరం పొందిన హోలిక, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశించింది.
విష్ణుమూర్తి రక్షణతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడగా, హోలిక ఆ అగ్నిలో దహనమైంది. దీనికి గుర్తుగానే హోలీకి ముందు రోజు రాత్రి ‘హోలికా దహన ము నిర్వహిస్తారు.
రాధా-కృష్ణుల దైవిక ప్రేమ
శ్రీకృష్ణుడు చిన్నప్పుడు తన నీలి రంగు చర్మం గురించి మరియు రాధ తెల్లటి రంగు గురించి చింతిస్తూ తల్లి యశోదకు చెప్పగా, రాధ ముఖానికి కూడా రంగు పూయమని ఆమె సూచించింది.
కృష్ణుడు సరదాగా రాధ మరియు ఇతర గోపికలపై రంగులు చల్లడం ద్వారా ఈ రంగుల పండుగ సంప్రదాయం మొదలైందని నమ్ముతారు.
వసంత రుతువు ఆగమనం
చీకటి నుంచి వెలుగుకు, శీతాకాలం ముగిసి వసంతం రాకకు సంకేతంగా హోలీని జరుపుకుంటారు.
దీనిని కామ దహనంగా కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు.
హోలిని పర్యావరణ అనుకూలమైనది గా జరుపుకుందాం
రసాయన రంగులు వాడకుండా సహజ రంగులు వాడుదాం.
పువ్వులథో కుడినా రంగులను వాడుదాం.
నీరును పొదుపుగా వాడుదాము.
రంగులకు బదులుగా గుడ్లు వాడడాన్ని మన్నెద్దాము.
రంగులు చల్లుకునేటపుడు కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోవాలి.
రంగుల పండుగ మనందరి జీవితాలలో ఆనందం వెల్లి విరసాలనీ, కుల మతాలకు అతితంగా పండుగను జరుపుకొని భారత దేశ ఐక్యత ను ప్రపంచానికి చాటుదామనీ వారు కోరారు.
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
