కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి. రంగా రావు “షష్టిపూర్తి” మరియు వారి మనవడి మొదటి పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించి, రంగా రావు కి షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. రంగా రావు పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

Scroll to Top