చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన మూడు గ్రామాల గురించి శాసనమండలిలో చర్చించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
మున్సిపల్ ఎన్నికలకు ముందు చిలకలూరిపేట కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవి మూడు గ్రామాలు పసుమర్రు,మానుకొండవారిపాలెం,గణపవరం.
ఈ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపిన తర్వాత కొంతమంది మున్సిపాలిటీలో కలపడానికి వీల్లేదని కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లిన తర్వాత ఎన్నికలు జరిగినాయి.ఎన్నికలు మాత్రం మున్సిపాలిటీ వాళ్లు ఆ గ్రామాలను కలుపుకొని ఎన్నికలు జరిపారు. అక్కడినుండి కౌన్సిలర్లు కొంతమంది ఎన్నికయ్యారు.
గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ ఏ ఆర్థిక నిధులు ఆ గ్రామాలకు ఇవ్వలేదు. కారణం ఏమిటంటే అవి పంచాయతీలు గానే ఉన్నాయి ఇంకా పూర్తిగా మున్సిపాలిటీలో కలవలేదు హైకోర్టులో రిట్ పెండింగ్ ఉందని మున్సిపాలిటీ వారు అంటారు. పంచాయతీ వారేమో మేము ఎన్నికలు జరపలేదు మున్సిపాలిటీ వారు ఎన్నికల జరపమన్నారు కౌన్సిలర్లు గా కూడా ఎన్నికయ్యారు. కాబట్టి మున్సిపల్ పరిపాలన జరుగుతుంది కాబట్టి మేము పంచాయతీ నిధులు ఇవ్వమని వారు చెప్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆర్థిక నిధులు వాటికి రావు,అలాగే మున్సిపాలిటీ కి వచ్చే ఆర్థిక నిధులు కూడా ఆ గ్రామాలకు పోవు. ఈ రకంగా ఏ రకంగా అభివృద్ధి జరగకుండా గడిచిన ఐదు సంవత్సరాలు ఏ రకమైన నిధులు రాక అభివృద్ధి జరగక ఆ గ్రామాల కు చాలా నష్టం జరిగింది.
ప్రభుత్వం వారు ఇకనైనా ఇక్కడ ఎలా అయితే స్పెషల్ మెన్షన్ వేస్తామో అలాగే అక్కడ ఆ కోర్టులో కూడా స్పెషల్ మెన్షన్ వేసి ఆ కేసులు విచారణకు తీసుకువచ్చి వాటిని త్వరగా పరిష్కరించి అవి మున్సిపల్ పరిధిలో ఉంటాయా లేక గ్రామ పంచాయతీల పరిధిలోకి పంపిస్తారా అనేది పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ గ్రామాలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలాగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నకు విజ్ఞాపన చేశారు*

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
