జీడికే 11 ఇంక్లెన్ లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని గోదావరిఖని సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జీడికే 11 ఇంక్లైన్ లో తెల్లవారుజామున ప్రమాదం జరిగి కోల్ కట్టర్ కార్మికుడు ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గనిలో బ్లాస్టింగ్ అనంతరం చెటాయి చేస్తుండగా సైడ్ ఫాల్ కావడంతో కార్మికుడికి నడుము , కుడికాలుపై బొగ్గు పెల్లలు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కార్మికున్ని గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, జి.ఎం.కమిటి మెంబర్ సిద్దమల్ల రాజు, గని ఫిట్ సెక్రటరీ నాయిని శంకర్ లు ఏరియా హాస్పిటల్ కు వెళ్లి గాయపడిన కార్మికుడిని పరామర్శించిన అనంతరం, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేయాలని వారు ఏరియా హాస్పిటల్ డాక్టర్ లకు కోరగా వారు కార్మికుడి ని హైదరాబాద్ కు పంపించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
