కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర పరిధిలోని బౌద్ధ నగర్‌

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర పరిధిలోని బౌద్ధ నగర్‌లో, పద్మ నగర్ వాసులు శాగాపురం శరత్‌చంద్ర గౌడ్ మరియు దూసరి దీపక్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన 365 జిమ్ మరియు బాక్స్ క్రికెట్ ను ముఖ్య అతిథిగా కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ సదుపాయాలు యువతకు క్రీడా ప్రేరణను అందిస్తాయి. స్థానికులు ఆరోగ్యంగా, సక్రియంగా ఉండటానికి ఇవి ఒక గొప్ప అవకాశంగా మారతాయి. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో యువతను సక్రియంగా, సమగ్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి” అన్నారు.

ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్ గౌడ్, మైసిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top