సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చెయ్యండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు.
ఈ నెల ఆగష్టు 20 నుండి 22వరకు కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లో నిర్వహిస్తున్నామని ఆ మహాసభల విజయవంతం కోసం అందరు సహకరిచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబాశివరావు గారు అన్నారు.
ఈ మహాసభల విజయవంతం కోసం నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఇంచార్జి కోలాన్ హనుమంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిపిఐ తెలంగాణా రాష్ట్ర 4వ మహాసభలకు రాష్ట్రం లోని 33జిల్లాల నుండి ఎంపిక చెయ్యబడిన 1000మంది ప్రతినిధులు పాల్గొంటారని,3 రోజుల పాటు జరిగే చర్చల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యలు భవిష్యత్తులో పార్టీ ఉద్యమ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ ఎదుగుదల కోసం సూచనలు సలహాలు ఇచ్చి రాబోవు 3సంవత్సరాల కోసం దిశా నిర్దేశం చేస్తారని అన్నారు.ఈ మహాసభలకు అనేక పోరాటాలను నిర్వహించి జైలు జీవితాలను అనుభవించిన ఉద్యమకారులు, మేధావులు,యువకులు,విద్యార్థులు,కార్మికులు సంఘాల నాయకులు పాల్గొంటారని అన్నారు.
కొలను హనుమంత్ రెడ్డి గారు కూనంనేని గారిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్,రాష్ట్ర నాయకులు ఏసురత్నం,సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండల కార్యదర్శులు స్వామి,శ్రీనివాస్, నాయకులు యాదయ్య, దస్తగిరి,సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
