కాణిపాకంలో కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు
** “శాప్” చైర్మన్ రవినాయుడు నేతృత్వం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / పూతలపట్టు: తెలుగుదేశం పార్టీ యువ కెరటం, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి అఖిలాండం వద్ద 226 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇందుకు “శాప్” చైర్మన్ అనిమిని రవినాయుడు నేతృత్వం వహించగా… కాణిపాకం టెంపుల్ చైర్మన్ మణి నాయుడు, తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, యువగళం టీంతో కలిసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీర్వాదంతోనే పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో తనను తాను ప్రజా నాయకుడిగా మలచుకున్న లోకేష్ గత ఐదేళ్లలో అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఏకతాటిపై పార్టీని నడిపించిన యువనేత
యువగళం పాదయాత్రతో ప్రజానాయకుడిగా రాటుతేలిన లోకేష్ అని ప్రసంశించారు. యువగళం ఒక నవశకానికి నాంది పలికింది. యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.
పార్టీని నడపగలిగే శక్తి, సామర్థ్యం నారా లోకేష్ కు ఉందని రవి నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల టీడీపీ అధ్యక్షులు హరిబాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవ్, ప్రకాష్, తెలుగు యువత అధ్యక్షులు కృష్ణ యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు త్యాగరాజు, కొట్టే హేమంత్ రాయల్, శ్రీధర్, బాబి, ధనంజయ నాయుడు, ఎల్లప్ప, శరవణ, మధు, యువగళం వాలంటీర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
