మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి పలు ఆహ్వానాలను అందజేసిన నియోజకవర్గం ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి వివిధ ఆహ్వానాలను అందజేయడం జరిగింది.. మరియు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయిస్ శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా స్పందించి ఆహ్వానాలను స్వీకరించారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
