సేవల పంపిణీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్
- ప్రజల సంతృప్తి స్థాయి గీటురాయిగా ముందడుగు
- పేదరిక నిర్మూలన దగ్గరి నుంచి డీప్ టెక్ వరకు పది సూత్రాలపై ప్రత్యేక దృష్టి
- సమష్టి కృషితో జీడీడీపీ, తలసరి ఆదాయ వృద్ధికి కార్యాచరణ
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పాలనలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో జిల్లాలో ప్రభుత్వ సేవల పంపిణీలో వేగాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వర్చువల్‌గా హాజరయ్యారు. జీఎస్డీపీ, కీలక ప్రగతి సూచికలు (కేపీఐ), స్వర్ణాంధ్ర విజన్ – పది సూత్రాలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, పీపీపీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రతిపాదనలు, రియల్‌టైమ్ గవర్నెన్స్, రెవెన్యూ సేవలు, వీబీ- జీ రామ్ జీ యాక్ట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించి ఆయా అంశాల్లో ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు.
వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లోనూ 18 శాతం సుస్థిర వృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలన-పీ4 మొదలు డీప్ టెక్ వరకు స్వర్ణాంధ్ర విజన్ పది సూత్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కీలక ప్రగతి సూచికల్లో జిల్లా ముందంజలో ఉందని, పేదరిక నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాల అమల్లో సమష్టి కృషితో పనిచేస్తున్నామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సేవల్లో ప్రజల సంతృప్తి పరంగానూ ముందంజలో ఉన్నామని.. ఇదేవిధంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటుచేసి రెవెన్యూ సేవలను సత్వరం అందించేందుకు, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. జీడీడీపీ, తలసరి ఆదాయ వృద్ధి లక్ష్యాలపైనా దృష్టిసారిస్తున్నామని, ఎంఎస్ఎంఈల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు కూడా కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
