ఘనంగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

Sakshitha news

ఘనంగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

యువ కెరటం, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ జన్మదిన శుభసందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి కేక్ కట్ చేసి యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. అలాగే డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లోని జగద్గురు రవిదాస్ మహారాజ్ మందిరంలో సమగర మొచి సంగం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అనంతరం డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లోని శ్రీ రాజేశ్వరి ఓల్డేజ్ హోం లో కాలనీ వాసుల ఆధ్వర్యంలో వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతిఒక్కరికి పేరుపేరునా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top