తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సభ్యులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ని కలిశారు
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతి సారధిలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు
ఎన్నికల సమయంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మాకు ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాల కోసం ఫోరం గా ఏర్పడి పోరాటం చేస్తున్న కళాకారులకు తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన కళాకారులకు అండగా ఉంటామని అన్నారు.
కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలో వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద కళాకారులు చేపట్టే ధర్నాలో తెలంగాణ జాగృతి పాల్గొంటుంది అని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
